బారాబంకి: మతమార్పిడి(Religious Conversion)కి పాల్పడుతున్న ఓ వ్యక్తిని యూపీలో అరెస్టు చేశారు. 230 మంది దళిత కుటుంబాలను అతను క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నం చేశాడు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతూ ఆ వ్యక్తి మతమార్పిడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో లక్నోకు చెందిన బజరంగ్ రావత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బైబిల్‌తో పాటు క్రైస్తవ మతానికి చెందిన పుస్తకాలను అతని ఇంటి వద్ద నుంచి రికవరీ చేశారు. విజయ్ హిందుస్తానీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు కారణంగా రావత్‌పై కేసు బుక్ చేశారు. వ్యాధులు నయం చేస్తానని స్థానిక పేద మహిళలను పిలిచి, ఆ తర్వాత వాళ్లు మతం మారేలా ప్రోత్సహించేవాడని ఆరోపణలు ఉన్నాయి.