గురువారం 28 మే 2020
National - May 07, 2020 , 14:18:43

పెండ్లీ చేసుకోవ‌డానికి ట్ర‌క్కులో..యువ‌తి, యువ‌కుడిపై కేసు

పెండ్లీ చేసుకోవ‌డానికి ట్ర‌క్కులో..యువ‌తి, యువ‌కుడిపై కేసు

సిమ్లా:  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కులు జిల్లాకు చెందిన యువ‌కుడు, ర‌ష్యాకు చెందిన త‌న గ‌ర్ల‌ఫ్రెండ్‌ను సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా త‌న స్వంత గ్రామంలో పెండ్లి చేసుకోవాల‌నుకున్నాడు. క‌రోనావైర‌స్ కార‌ణంగా రాష్ట్రంలో క‌ర్ఫూ విధించిన సంగ‌తి తెలిసిందే. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంగించిన యువ‌తి, యువ‌కుడు, మ‌రో ముగ్గురు వ్య‌క్తులు ట్ర‌క్కులో దాక్కుని సిమ్లాకు చేరుకున్నారు. ఛండిగ‌డ్ - సిమ్లా జాతీయ ర‌హ‌దారిపై షోఘి ప‌ట్ట‌ణంకు 15 కిలోమీట‌ర్ల దూరంలో పోలీసులు జ‌రిపిన త‌నిఖీలో వీరు ప‌ట్టుబ‌డ్డారు. 

క‌ర్ప్యూ నిబంధ‌నలు ఉల్లంఘించినందుకు వారిని అరెస్ట్ చేసిన‌ట్లు జిల్లా ఎస్పీఒమాప‌తి జామ్యాల్ తెలిపారు. వారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడా నుంచి వ‌చ్చిన‌ట్లు వివ‌రించారు. కులు జిల్లాలోని వ‌రుడి స్వ‌స్థ‌లం నిర్మండ్‌కు వెళ్లి వివాహం చేసుకోవాల‌ని వీరి ప్లాన్‌. ట్ర‌క్కు డ్రైవ‌ర్‌, క్లీన‌ర్‌ను కూడా అరెస్టు చేశాం. యువ‌తిని ఢిల్లీలోని క్వారంటైన్‌కు, యువ‌కుడితో స‌హా డ్రైవ‌ర్‌, క్లీన‌ర్‌ను షోఘీలోని క్వారంటైన్‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు. 


logo