గ్వాలియర్: ఒక భార్యతో మూడు రోజులు, మరో భార్యతో మూడు రోజులు, ఆదివారం అతనికి ఇష్టప్రకారం ఉండొచ్చు. ఇదీ ఇద్దరు భార్యలతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్యామిలీ కోర్టు బయట రాజీలో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందం. గురుగావ్‌లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువకుడితో 26 ఏళ్ల యువతికి 2018లో వివాహం జరిగింది. 2020లో కొవిడ్ సమయంలో గ్వాలియర్‌లోని ఇంటికి వచ్చేశారు. కొన్నాళ్ల తర్వాత ఒక్కడే గురుగావ్ వెళ్లాడు. అయితే ఎన్నాళ్లయినా తనను కాపురానికి తీసుకువెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన భార్య విచారించగా, అతను సహచర ఉద్యోగిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి నిర్ఘాంతపోయింది. దీంతో మొదటి భార్య గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టులో భరణం కేసు దాఖలు చేసింది. కేసు విచారణకు ముందు రాజీ ప్రయత్నం కోసం ఫ్యామిలీ కోర్టు అడ్వకేట్ హరీష్ దీవాన్‌ను కౌన్సిలర్‌గా నియమించింది.