గోరఖ్‌పూర్ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఉగ్రవాది కాదని ప్రముఖ నటి, సన్యాసిని మమతా కులకర్ణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె మూడు రోజులపాటు ఆధ్యాత్మిక యాత్ర కోసం మంగళవారం గోరఖ్‌పూర్ వచ్చారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, దావూద్ ముంబై పేలుళ్లను జరపలేదని, అతను ఉగ్రవాది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ అవడంతో ఆమెపై ఆగ్రహం పెల్లుబికింది.
దీంతో ఆమె గురువారం వివరణ ఇచ్చారు. తాను విక్కీ గోస్వామి గురించి చెప్పానని, దావూద్ ఇబ్రహీం కచ్చితంగా ఉగ్రవాదేనని చెప్పారు. తాను దావూద్‌ను వ్యక్తిగతంగా ఎన్నడూ కలవలేదని తెలిపారు. విక్కీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టయి, జైలు జీవితం గడిపారు.