కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె సీఎం పదవి చేపట్టడం ఇది వరుసగా మూడోసారి. కొవిడ్ కారణంగా గవర్నర్ అధికార నివాసంలో నిరాడంబరంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్ ఆమెను అభినందించారు.
ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కౌంటింగ్ జరిగిన 292 స్థానాలకుగాను 213 స్థానాల్లో విజయంతో తృణమూల్ మూడోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఫలితాల తర్వాత బెంగాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇందులో 12 మంది చనిపోయారు. ఈ హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. మంగళవారం రాష్ట్ర గవర్నర్ జగ్దీప్తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే.
Mamata Banerjee takes oath as the Chief Minister of #WestBengal for a third consecutive term. She was administered the oath by Governor Jagdeep Dhankhar. pic.twitter.com/IXy05xNZPZ
— ANI (@ANI) May 5, 2021