గోవు తిరగబడితే పరిహారం బీజేపీ నేతలు చెల్లిస్తారా ? : కౌ హగ్ డేపై కేంద్రాన్ని నిలదీసిన దీదీ
వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగిలించుకునే దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
కోల్‌కతా : వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగిలించుకునే దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రజల్ని ఆవు ఢీ కొంటే ఏమవుతుందో తెలుసా అంటూ ఆమె కేంద్రాన్ని నిలదీశారు. ఫిబ్రవరి 14ను కౌ హగ్ డేగా పాటించాలని భారత జంతు సంక్షేమ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసి ఆపై దాన్ని ఉపసంహరించుకున్న నేపధ్యంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
కౌ హగ్ నోటిఫికేషన్‌పై మండిపడ్డ దీదీ ఆవు మనిషిని ఢీ కొడితే ఏమవుతుందని విస్మయం వ్యక్తం చేశారు. ఆవు మన మీదికి దూసుకొచ్చి ఢీ కొంటే పరిహారం వారు (బీజేపీ) చెల్లిస్తారా అని దీదీ ప్రశ్నించారు. ఇక అంతకుముందు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో భారత సంస్కృతి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధకు ఆవు వెన్నెముకని మనందరికీ తెలుసు..ఆవును మనం కామధేనువుగా, గోమాతగా భావించి పూజిస్తాం..ఆవును కౌగిలించుకుంటే మనం ఎమోషనల్‌గా సుసంపన్నమవుతాం..అది మన వ్యక్తిగత, సామూహిక సంతోషాన్ని ఇనుమడింపచేస్తుందని పేర్కొంది.
గోవు ప్రేమికులంతా వాలెంటైన్స్ డేను కౌ హగ్ డేగా జరుపుకోవాలని లేఖ చివరిలో అభ్యర్ధించారు. ఈ నోటిఫికేషన్‌పై విపక్షాలు విరుచుకుపడటంతో ఆపై ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే ఈ నోటిఫికేషన్‌కు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సహా పలువురు బీజేపీ నేతలు మద్దతు పలికారు. ప్రతి ఒక్కరూ గోవులను గౌరవించాలని, ఇది మంచి కార్యక్రమమని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

