బీజేపీలో చేరగానే నేర చరితులు ఇలా స్వచ్ఛంగా బయటికొస్తారని నలుపు, తెలుపు వస్ర్తాలతో ఉదహరిస్తున్న మమతా బెనర్జీ
కోల్‌కతా, మార్చి 29: దుశ్శాసనుడి లాంటి బీజేపీ పార్టీ ఎల్ఐసీ, ఎస్బీఐ లాంటి సంస్థలను అమ్మి దేశాన్ని నాశనం చేస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. అలాంటి బీజేపీని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించడానికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాల భారతీయ పౌరులు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికలు దేశ ప్రజలకు, బీజేపీకి మధ్య పోరాటమని మమత అన్నారు. బెంగాల్‌పై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా ఆమె బుధవారం రెండు రోజుల ధర్నాకు దిగారు.