న్యూఢిల్లీ : మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం రైల్వేలను నాశనం చేయడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తాజా రైల్వే పర్ఫామెన్స్ రిపోర్ట్‌పై ఆయన స్పందిస్తూ.. కొత్త రైళ్లకు జెండా ఊపు తూ మోదీ స్టంట్లు చేస్తున్నారని, సామాన్యుల భద్రత పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బాలాసోర్‌లో జరిగిన రైళ్ల ప్రమాదాల వంటివి తరచూ జరుగుతున్నప్పటికీ, ‘కవచ్’ రక్షణను కనీసం ఒక కిలోమీటరుకైనా అదనంగా కల్పించలేదని మండిపడ్డారు. ఇదిలావుండగా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధిపరచిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్‌ను 1,500 కిలోమీటర్ల ట్రైన్ రూట్లో సంపూర్ణంగా అమర్చినట్టు తెలిపారు.