Mallikarjun Kharge | నిరంకుశ సర్కార్ పతనానికి కౌంట్‌డౌన్ షురూ : మల్లికార్జున్ ఖర్గే
నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలోని ఎన్డీయే నిరంకుశ సర్కార్ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కాంగ్రస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు.
ముంబై : నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలోని ఎన్డీయే నిరంకుశ సర్కార్ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కాంగ్రస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు. ముంబైలో జరుగుతున్న విపక్ష కూటమి ఇండియా భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన ఖర్గే ఇండియా సమైక్యంగా నిలిచింది..ఇండియా విజేతగా నిలుస్తుందని క్యాప్షన్ ఇచ్చారు. పురోగామి, సంక్షేమ, సమ్మిళిత ఇండియా కోసం తాము కలిసికట్టుగా నిలిచామని ఖర్గే రాసుకొచ్చారు. దేశంలో మార్పు అవసరమని 140 కోట్ల భారతీయులు నిర్ణయించుకున్నారని అన్నారు.
ఈ నిరంకుశ సర్కార్ పతనానికి కౌంట్‌డౌన్ ఆరంభమైందని పేర్కొన్నారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా కలిసికట్టుగా పనిచేయాలని పలు తీర్మానాలు చేసిన విపక్ష ఇండియా సమావేశంలో కీలక కమిటీలనూ ఏర్పాటు చేశారు. 12 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని నియమించామని భేటీ అనంతరం శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు.
సమన్వయ కమిటీలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ), టీఆర్ బాలు (డీఎంకే), హేమంత్ సోరెన్ (జేఎంఎం), సంజయ్ రౌత్ (ఎస్ఎస్-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), లలన్ సింగ్ (జేడీయూ), డీ. రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీపీఎం నుంచి మరో సభ్యుడు ఉంటారని రౌత్ తెలిపారు.అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులతో కూడిన నాలుగు ప్రధాన కమిటీలను ఈ సమావేశంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రచార కమిటీ, సోషల్ మీడియా వర్కింగ్ గ్రూప్ కమిటీ, మీడియా కమిటీ, రీసెర్చి కమిటీలను కూడా నియమించామని తెలిపారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది.
Read More :
MP woman dragged, kicked | మధ్యప్రదేశ్‌లో మరో దారుణం.. శిశువుకు పాల కోసం వెళ్లిన మహిళను ఈడ్చి కొట్టిన వైనం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

