భోపాల్: శిశువుకు పాల కోసం క్యాంటీన్‌కు వెళ్లిన మహిళను కొందరు వ్యక్తులు ఈడ్చి కొట్టారు. (MP woman dragged, kicked) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం జరిగింది. ఆగస్ట్ 13న తెల్లవారుజామున సాగర్ సిటీలోని బస్టాండ్ ఫుట్‌పాత్ వద్ద ఒక మహిళ తన బిడ్డతో ఉన్నది. శిశువును ఫుట్‌పాత్ వద్ద ఉంచి పాల కోసం బస్టాండ్ వద్ద ఉన్న క్యాంటీన్‌కు వెళ్లింది. పాలు కొన్న ఆ మహిళ డబ్బులు ఇవ్వడం మరిచిపోయింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ఆ మహిళను పక్కకు ఈడ్చారు. కాళ్లతో తన్ని, కర్రతో కొట్టారు. దీంతో తనను కొట్టవద్దంటూ ఆ మహిళ వారిని ప్రాధేయపడింది. అక్కడ గుమిగూడిన కొందరు జోక్యం చేసుకున్నారు.
కాగా, తన బిడ్డ ఫుట్‌పాత్ వద్ద ఉందని, పాల కోసం వచ్చినట్లు ఆ మహిళ చెప్పింది. దీంతో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న శిశువును కొందరు గమనించి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. శిశువును, మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేన్నట్లు తెలుసుకున్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై స్పందించారు. ఆ మహిళను ఈడ్చి కొట్టిన నిందితులను 26 ఏండ్ల ప్రవీణ్ రైక్వార్, 20 ఏండ్ల విక్కీ యాదవ్, 40 ఏండ్ల రాకేష్ ప్రజాపతిగా గుర్తించారు. గోపాల్‌గంజ్ పోలీసులు గురువారం ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. జనమంతా చూస్తుండగా రోడ్డుపై నడిపించి తీసుకెళ్లారు. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
"Bhaiya, bhaiya… don't beat"
In MP's Sagar, a hotel staff brutally thrashed a woman in broad daylight just for asking for milk for her hungry child.
And today is Raksha Bandhan. Awful.pic.twitter.com/GlaB5rBKuL
— Mission Ambedkar (@MissionAmbedkar) August 31, 2023
Update:
Police arrested three hotel staff who ghastly thrashed a woman for asking for milk for her hungry child in MP's Sagar.
Culprits Praveen Raikwar, Vicky Yadav and Rakesh Prajapati should be punished strictly. Our voice makes an impact. pic.twitter.com/GRSUnnW7Zs
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) September 1, 2023