పురుషులకూ గర్భ నిరోధక మాత్ర!
త్వరలో పురుషులకు కూడా గర్భనిరోధక మాత్ర అందుబాటులోకి రానుంది. ఈ దిశగా అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. లైంగిక చర్యకి సుమారు 30 నిమిషాల ముందు ఈ మాత్ర తీసుకుంటే, ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు వీర్య కణాలను తాత్కాలికంగా అడ్డుకునేలా చేస్తుంది.
న్యూఢిల్లీ : త్వరలో పురుషులకు కూడా గర్భనిరోధక మాత్ర అందుబాటులోకి రానుంది. ఈ దిశగా అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. లైంగిక చర్యకి సుమారు 30 నిమిషాల ముందు ఈ మాత్ర తీసుకుంటే, ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు వీర్య కణాలను తాత్కాలికంగా అడ్డుకునేలా చేస్తుంది. అమెరికాలోని వెయిల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకులు ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.
వీర్య కణాల కదలికకు అవసరమైన సాల్యూబుల్ అడెనైలిల్ సైక్లేజ్(ఎస్ఏసీ) అనే ఎంజైమ్ పనితీరును ఈ ఔషధం తాత్కాలికంగా అడ్డుకుంటుంది. దీంతో వీర్య కణాలు అండాన్ని చేరి, ఫలదీకరణం జరిపే అవకాశాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఎలుకలపై నిర్వహించిన ప్రాథమిక పరిశోధనల్లో ఈ విధానం గర్భధారణను తాత్కాలికంగా నిరోధించినట్లు గుర్తించారు. ఔషధ ప్రభావం తగ్గిన తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం సాధారణ స్థితికి వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

