మొత్తం వ్యవస్థ ఫార్మసీ కంపెనీలకు దాసోహం!
ఔషధాల గరిష్ఠ రిటైల్ ధర(ఎంఆర్పీ)కు, రిటైలర్లకు చెల్లించే ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. మొత్తం వ్యవస్థ ఫార్మాస్యూటికల్ తయారీదారులకు సహాయపడేలా ఎందుకు పనిచేస్తున్నది? అని న్యాయస్థానం నిలదీసింది.
- కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసహనం
న్యూఢిల్లీ, అక్టోబర్ 27 : ఔషధాల గరిష్ఠ రిటైల్ ధర(ఎంఆర్పీ)కు, రిటైలర్లకు చెల్లించే ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. మొత్తం వ్యవస్థ ఫార్మాస్యూటికల్ తయారీదారులకు సహాయపడేలా ఎందుకు పనిచేస్తున్నది? అని న్యాయస్థానం నిలదీసింది. మొత్తం వ్యవస్థను నియంత్రించకూడదనేది ప్రభుత్వ విధానమని కేంద్రం కోర్టుకు తెలిపింది. దీనికి జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యక్తులకు(తయారీదారులకు) సహాయపడేలా మొత్తం వ్యవస్థ ఎందుకు పనిచేస్తున్నది? అని ప్రశ్నించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ్రప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) పూర్తిగా నిష్క్రియంగా ఉన్న సంస్థగా కనిపిస్తున్నదని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశంలో మందుల ధరల సమస్యను లేవనెత్తిన రెండు పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది.
ఎంఆర్పీకి, రిటైలర్‌కు చెల్లించే ధర మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ ఇలా జరగడానికి అనుమతిని ఇస్తున్నదని ధర్మాసనం పేర్కొంది. ఇది ప్రభుత్వం కళ్లముందే జరుగుతున్నది. దీనిని ఇలాగే అదుపు లేకుండా సాగనివ్వాలా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదిస్తూ భారతదేశంలో మందుల ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ పిటిషన్లపై ఈనెల 12న విచారణ జరుపుతున్న సందర్భంగా క్యాన్సర్ నిరోధక మందుల ట్రేడ్ మార్జిన్‌ను గరిష్ఠ రిటైల్ ధర(ఎంఆర్పీ)లో 30 శాతానికి పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందనపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మందుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ట్రేడ్ మార్జిన్‌ను పరిమితం చేయలేదని ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

