కర్ణాటక ‘సర్’లో కోటి ఓట్ల తొలగింపు
కర్ణాటక ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ పూర్తయ్యింది. మంగళవారం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 1.08 కోట్ల మంది పేర్లను తొలగించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.54 కోట్ల నుంచి 4.54 కోట్లకు తగ్గింది.
- తుది ఓటర్ల జాబితా విడుదల
బెంగళూరు : కర్ణాటక ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ పూర్తయ్యింది. మంగళవారం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 1.08 కోట్ల మంది పేర్లను తొలగించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.54 కోట్ల నుంచి 4.54 కోట్లకు తగ్గింది. కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం తుది జాబితాలో 4,54,55,698 మంది ఓటర్లు ఉన్నారు.
వీరిలో 2,25,40,493 మంది పురుషులు, 2,29,12,255 మంది మహిళలు, 2,841 మంది ఇతర లింగానికి చెందినవారు ఉన్నారు. 18 నుంచి 19 ఏండ్ల మధ్య వయసున్న కొత్త ఓటర్లు 6.83 లక్షల మంది ఉన్నారు. కర్ణాటకలో జూన్ 30న ‘సర్’ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అప్పటికి నమోదై ఉన్న 5.54 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించే బాధ్యతను బూత్ స్థాయి అధికారులు(బీఎల్వోలు) చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు ఫారాలను సేకరించి, వివరాలను ధ్రువీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

