ఏఐ, డీప్ ఫేక్‌ల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి
కళాకారుల గౌరవం, పౌరుల భద్రతను కాపాడటం మనందరి సమిష్టి బాధ్యత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్ ఫేక్ లు, డిజిటల్ ఇంపర్సనేషన్ (నకిలీ రూపాలు) వంటి సాంకేతిక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు, రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): కళాకారుల గౌరవం, పౌరుల భద్రతను కాపాడటం మనందరి సమిష్టి బాధ్యత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్ ఫేక్ లు, డిజిటల్ ఇంపర్సనేషన్ (నకిలీ రూపాలు) వంటి సాంకేతిక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు, రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖలను ఉద్దేశించి రూపొందించిన ఒక అధికారిక విజ్ఞాపన పత్రాన్ని ఆయన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి అందజేశారు.
ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా సోమవారం వెల్లడించారు. కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హకులతో పాటు దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను కాపాడటం మనందరి సమిష్టి బాధ్యత. సాంకేతికత అనేది సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఉండాలి తప్ప, మనుషుల గౌరవాన్ని నాశనం చేసేదిగా మారకూడదు అని చిరంజీవి తన పోస్ట్ లో స్పష్టం చేశారు. సినీ పరిశ్రమను వేధిస్తున్న ఈ డీప్ ఫేక్ సమస్యపై కేంద్రం త్వరలోనే పటిష్టమైన చట్టపరమైన రక్షణ కల్పిస్తుందని చిత్ర పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయని ఆయన తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

