అడిగినట్టు వండిస్తారు
ఏ స్వీట్ షాప్‌కైనా పోయి.. ‘ఇది ఎక్కువ ఉండాలి. అది తక్కువ ఉండాలి. మరొకటి అసలే ఉండొద్దు’అంటే ‘అలాంటివి లేవు పో’ అంటారు. అక్కడ ఉన్నవే కొనాలి. వాళ్లిచ్చిందే తినాలి. కాదని వాదులాడితే కస్టమర్ బీపీ ఇంకొంచెం పెరుగుతుంది. వీళ్లు మాత్రం.. ఉప్పు, కారం, చక్కెర.. ఇంకేదైనా లేకుండా వండిపెట్టమని ఆర్డరిస్తే వండిస్తారు. ఇలాగే వండాలని ఆర్డర్ చేసినా ఓకే అంటారు.
ఏ స్వీట్ షాప్‌కైనా పోయి.. ‘ఇది ఎక్కువ ఉండాలి. అది తక్కువ ఉండాలి. మరొకటి అసలే ఉండొద్దు’అంటే ‘అలాంటివి లేవు పో’ అంటారు. అక్కడ ఉన్నవే కొనాలి. వాళ్లిచ్చిందే తినాలి. కాదని వాదులాడితే కస్టమర్ బీపీ ఇంకొంచెం పెరుగుతుంది. వీళ్లు మాత్రం.. ఉప్పు, కారం, చక్కెర.. ఇంకేదైనా లేకుండా వండిపెట్టమని ఆర్డరిస్తే వండిస్తారు. ఇలాగే వండాలని ఆర్డర్ చేసినా ఓకే అంటారు. సంప్రదాయ వంటలు తినాలనే కోరిక, రోగాలు తగ్గించుకునే బాధ్యత, ఆరోగ్యాన్ని పెంచుకునే అవకాశం ఉన్న తిండి దొరకడం కంటే అదృష్టం ఇంకేముంది. ఆ అదృష్టం దక్కాలంటే స్నాక్స్ బుట్టలో
చిరుతిళ్లకు ఆర్డర్ చేస్తే సరి!
హైదరాబాద్‌లో పలు టీవీ చానెల్స్‌లో వంగపల్లి పద్మ ఉద్యోగం చేసింది. కొన్నాండ్ల తర్వాత మీడియా రంగాన్ని వదిలిపెట్టింది. సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతూ, ఆరోగ్యవంతమైన ఆహారానికి మద్దతిచ్చే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్లో చేరింది. ఆ సంస్థ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు సేకరించేది. వాటిని ‘సహజ ఆహారం’ స్టోర్లలో విక్రయించేది.
హైదరాబాద్‌లోని స్టోర్‌లో పద్మ ‘ఫుడ్ ఎక్స్పర్ట్’గా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. సహజ ఆహారం స్టోర్‌లోనే ఒక చిన్న కిచెన్ ఉండేది. అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలతో రకరకాల చిరుతిళ్లు, పొడులు తయారు చేసేవాళ్లు. స్వీట్స్, హాట్స్, బిస్కెట్స్, సేమియాల తయారీ కోసం పద్మ లీడర్‌గా ఉన్న టీమ్ ఎక్స్‌పెర్‌మెంట్స్ చేస్తుండేది. కొన్ని ఎక్స్‌పెర్‌మెంట్స్ చేసిన తర్వాత వంటకం పర్ఫెక్ట్ అనుకున్నాక స్టోర్‌లో అమ్మేవాళ్లు. ఇలా దాదాపు అరవై ఉత్పత్తుల్ని తయారు చేసింది. అయిదేండ్ల తర్వాత ఆ ఉద్యోగం మానేసింది.

Padma Snacks
మేడ్ ఇన్ ‘స్వీట్ హోమ్’
కొన్ని సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఆరోగ్యకరమైన వంటలవైపు దృష్టి సారించింది పద్మ. శరీరాన్ని కాపాడే ఆహారం తయారీ కూడా ఆరోగ్యవంతమైన సమాజం కోసం పని చేయడమనే ఆలోచనతో కొద్ది కాలం క్రితం మళ్లీ స్వీట్స్, తినుబండారాలు వండటం మొదలుపెట్టింది. పొడులు, పచ్చళ్లు కూడా ప్రయోగాలు చేస్తూ ఆరోగ్యం కోసం సంప్రదాయ వంటల్ని నగరానికి పరిచయం చేసే ప్రయోగాన్ని ఇంట్లోనే మొదలుపెట్టింది.
హాలే కార్యశాల. కిచెనే ఉత్పత్తి కేంద్రం. సోషల్ మీడియా వాళ్ల స్టోర్. ‘మిల్లెట్స్‌తో చిరుతిళ్లు తయారు చేయాలి. మహిళలతో చిన్న సంస్థను నడపాలి’ అనే సంకల్పంతో మొదలైన పద్మకు మరో నలుగురు తోడయ్యారు. అనుకున్న రోజున అందరూ తీరిక చేసుకుని.. రాగి, జొన్న, కొర్ర, సజ్జలతో మురుకులు, లడ్డూలు, బూందీ తయారు చేస్తారు. వీటితోపాటు సజ్జ గవ్వలు, మిక్స్డ్ మిల్లెట్ బూందీ, మిల్లెట్ చెగోడీలు కూడా తయారు చేస్తారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తెచ్చుకుని ‘స్నాక్స్ బుట్ట’ పేరుతో వాళ్ల ఉత్పత్తుల్ని అమ్ముతున్నారు.
సహకారమే మా ఉపకారం
స్నాక్స్ బుట్ట వేదికగా చిరుతిళ్లు, కారం పొడులు, పచ్చళ్లు (ఆర్డర్‌పై) అమ్ముతున్నారు. వీటి తయారీకి ఉపయోగించే ఆహార పదార్థాలన్నీ రైతుల నుంచే కొనుగోలు చేస్తారు. గ్రామీణ సహకార సంస్థలు తయారు చేసే వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఉత్పత్తులే ఈ స్నాక్స్ తయారీలో వాడతామని చెబుతున్నది పద్మ. తృణ ధాన్యాలు, పప్పులు, కారం వంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి కొనుగోలు చేస్తామని, స్నాక్స్ తయారీకి ఉపయోగించేందుకు విజయ (తెలంగాణ) నూనెలు మాత్రమే వాడతామని, బెల్లం విజయనగర ప్రాంత రైతుల నుంచి సేకరిస్తామని చెప్పింది.
అన్ని రకాల ఉత్పత్తులను రైతులు, సహకార సంఘాల నుంచి కొనుగోలు చేయడం ద్వారా దళారీలు లాభపడకుండా, రైతులకు మేలు జరుగుతున్నదని ఆమె చెప్పింది. ‘ఇలా నిర్వహించడం వల్ల రైతుకు లాభాలతోపాటు మాకు నష్టాలూ ఉన్నాయట. ఒక్కోసారి ఒక్కో రైతు నుంచి కొనుగోలు చేయడం వల్ల వాటి రుచుల్లో తేడాలుంటాయి. కాబట్టి కొనేవాళ్లు కొన్నిసార్లు అభ్యంతరం చెబుతారు. వాళ్లకు రుచే ప్రధానం. రంగు, రుచి, నిల్వ కోసం కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన ఉత్పత్తులు ఒకే రుచితో ఉంటాయి. వాసన, రంగు కూడా మారదు. సాధారణ కస్టమర్లు అలా ఉండాలని కోరుకుంటారని, వాళ్లకు అవగాహన కల్పించడం అదనపు బాధ్యత’ అని స్నాక్స్ బుట్టలో పని చేసేవాళ్లంటున్నారు.

Padma Snacks2
కస్టమైజ్డ్ స్నాక్స్!
స్నాక్స్ బుట్టతో అధిక పోషకాలుండే ఆహారం, రసాయనాలు లేని ఆరోగ్యవంతమైన చిరుతిళ్లే కాదు కారం పొడులు, పచ్చళ్లు కూడా తయారు చేసి అమ్ముతున్నారు. ఆరోగ్యం కోసం పోషకాహారం తినడం మంచిదే. కానీ, కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు. మరికొందరు తినకూడదు. కొంతమందికి నచ్చదు. చర్మ సమస్యలు, ఆస్తమా, అలర్జీ, అజీర్తి, జీర్ణ సమస్యలు, బీపీ, డయాబెటిస్, ఒబెసిటీ ఉన్నవాళ్లు ఏ పదార్థం తొలగించాలో, దానికి బదులుగా ఏది కలపాలో చెబితే కస్టమైజ్డ్గా స్వీట్స్, ఇతర చిరుతిళ్లు తయారు చేసి ఇస్తున్నారు.
ఆరోగ్య సమస్యలను బట్టి ఉప్పు, కారం లేకుండా కూడా తయారు చేస్తారు. ఆమ్చూర్ పొడి మాత్రమే కలిపి ఇవ్వమంటే అదే కలిపి ఇస్తారు. కొంతమంది కొబ్బరి నూనెతోనే చేసివ్వమంటున్నారు. నగరంలో జరిగే ఎగ్జిబిషన్లకు నలుగురు నాలుగు సంచుల్లో పట్టుకుపోయి స్నాక్స్ బుట్టలు (స్వీట్ అండ్ హాట్ హ్యాంపర్) అమ్ముతున్నారు. పెండ్లి, ఫంక్షన్లకు రిటర్న్ గిఫ్ట్‌లుగా మంచి ఆహారాన్ని అందిద్దామనుకునే వాళ్ల కోసం స్వీట్స్, హాట్స్తో కలిపి రిటర్న్ గిఫ్ట్‌లనూ తయారు చేసి ఇస్తున్నారు. ఈ మధ్యనే పచ్చి పసుపు కొమ్ముతో పచ్చడి ప్రయోగం ఒకటి చేశారు.
పిల్లల కోసం పుష్టి
పిల్లల సరైన ఎదుగుదల కోసం బలవర్ధకమైన పొడిని తయారు చేశారు. అన్ని రకాల విటమిన్లు, మినిరల్స్తోపాటు ప్రొటీన్ శరీరానికి అందేలా పుష్టి పేరుతో అమ్ముతున్నారు. రాగి పిండి, కాజు, బాదామ్, గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగుడు గింజలు, పల్లీలు, ఓట్స్, పిస్తా, మకానా పొడులను తగు పాళ్లలో కలిపి రుచి కోసం బెల్లం, కోకో పౌండర్ జత చేసి తయారు చేశారు. పాలు, నీళ్లలో కలుపుకొని తాగితే పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుందని చెబుతున్నారు. అధిక పోషకాలు అందించే ఈ పుష్టితోపాటు ఆదివాసీలకు అధికంగా పోషకాలు అందించే ఇప్పపూల లడ్డూలు కూడా తయారు చేస్తున్నారు.
నాగవర్ధన్ రాయల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

