తిరువనంతపురం: మలయాళ నటి లీనా(Actor Lena) ఓ కీలక ప్రకటన చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. గగన్‌యాన్ ప్రాజెక్టులో టీమ్‌లీడర్‌గా ఉన్న ఫైటర్ పైలెట్, ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ తన భర్తే అని నటి లీనా ప్రకటించింది. ఇక ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ్‌తో దిగిన ఫోటోను కూడా ఆమె ఇన్‌స్టాలో పెట్టింది. తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఇన్నాళ్లూ చెప్పలేదన్నది. అయితే మంగళవారం ప్రధాని మోదీ దేశానికి నలుగురు ఆస్ట్రోనాట్లను పరిచయం చేసిన విషయం తెలిసిందే. కేరళలో జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురు వ్యోమగాముల్ని పరిచయం చేశారు.
ఆస్ట్రోనాట్ ప్రశాంత్ నాయర్‌ను ఈ ఏడాది జనవరి 17వ తేదీన పెళ్లి చేసుకున్నట్లు నటి లీనా వెల్లడించింది. తమది పెద్దలు కుదిర్చిన పెండ్లే అని పేర్కొన్నది. తమ పెళ్లి విషయాన్ని చెప్పేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూసినట్లు ఆమె తెలిపింది. ప్రశాంత్‌కు ప్రధాని మోదీ ఆస్ట్రోనాట్ వింగ్‌ను ఇవ్వడాన్ని గర్వంగా ఫీలవుతున్నట్లు లీనా చెప్పింది.