నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో తమ భూములను గుంజుకోవాలని చూస్తూ ఊరుకునేది లేదని నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం దమగాన్పూర్ రైతులు హెచ్చరించారు. సోమవారం దమగాన్పూర్ నుంచి రైతులు తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు.
వీరి ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. కార్యక్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంచర్ల గోపాల్, కౌన్సిలర్లు నరసింహ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.