హైదరాబాద్ : మానవుడు సంఘజీవి. సంఘంలో ఒకడిగా, సంఘంతో పాటుగా జీవించేవాని జీవితమే సార్థకం అంటారు పెద్దలు. ఇదే అంశంపై ఆధ్యాత్మక బౌద్ధ మత గురువు దలైలామా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇతరులకు సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందన్నారు. మనం ఎంత శక్తిమంతులుగా కనిపించినప్పటికీ, మనం జీవనం సంఘంపై ఆధారపడి ఉందన్నారు. వ్యక్తిగత సంతోషానికి సంఘం చాలా ముఖ్యమన్నారు. కాబట్టి మనం ఇతరులను సంతోషపరిస్తే, దాని నుండి మనం కూడా ప్రయోజనం పొందుతామని ఆయన పేర్కొన్నారు.
Helping others brings deep satisfaction. No matter how powerful we may seem to be, our survival depends on the community. Clearly the community is crucial to individual happiness, so if we make others happy, we too derive benefit.
— Dalai Lama (@DalaiLama) August 20, 2021