కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్ర (50), బీజేడీ మాజీ ఎంపీ పినాకీ మిశ్రా (65) వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ జర్మనీలోని బెర్లిన్లో అతి తక్కువ మంది సమక్షంలో, వైభవోపేతంగా పెండ్లి చేసుకున్నట్లు ఓ టీవీ చానల్ వెల్లడించింది.
మహువా సంప్రదాయ వస్ర్తాలు ధరించి, బంగారు ఆభరణాలు ధరించినట్లు కనిపిస్తున్న ఫొటోను ప్రదర్శించింది. మహువా పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ నుంచి రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. పినాకీ మిశ్రా 1996లో కాంగ్రెస్ తరఫున, 2009, 2014, 2019లలో బీజేడీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు.