న్యూఢిల్లీ : దేశ అంతర్గత గూఢచార వ్యవస్థలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కొత్త డైరెక్టర్‌గా మహేశ్ దీక్షిత్ నియమితులయ్యారు. ఈమేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆయన నియామకానికి గురువారం ఆమోదముద్ర వేసింది.
1993 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి దీక్షిత్ ప్రస్తుతం ఐబీ స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్లో భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన కెరీర్లో ఎక్కువకాలం ఐబీలోనే ఆయన సేవలందించారు.