హనుమకొండ చౌరస్తా : ఈనెల 10, 11 తేదీలలో మహారాష్ట్రలోని పూణే శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మహాలుంగేలో జరిగిన 5వ ఇండియా తైక్వాండో ఓపెన్ పారా జాతీయ ఛాంపియన్షిప్( National Championship ) 2026-27 లో తెలంగాణ పారా తైక్వాండో ( Para Taekwondo ) జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ను కైవసం చేసుకుంది. తెలంగాణ జట్టు మొత్తం 9 పతకాలు సాధించగా ఇందులో 4 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, 3 కాంస్య పతకాలు సాధించింది.
హనుమకొండ ఆరెపల్లికి చెందిన ఎల్లావుల గౌతమ్యాదవ్ , కె. లోకేశ్వరి, కె.శివ , జి.రాజేష్ స్వర్ణపతకాలు సాధించారు. నరసింహ డి.సాయిబాబా రజత పతకాలు, అబ్దుల్, రమేష్, సక్కుబాయి కాంస్య పతకాలు సాధించారు.ఈ సందర్భంగా ఇండియా తైక్వాండో పారా చైర్పర్సన్ వీణ, తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.ఎస్. దిలీప్, ప్రధాన కార్యదర్శి గణేష్యాదవ్ విజేతలను అభినందించారు.
భవిష్యత్తులో రాష్ర్టంలోని ప్రతిభావంతులైన పారా తైక్వాండో క్రీడాకారులను గుర్తించి, వారికి నాణ్యమైన శిక్షణ, అవసరమైన అవకాశాలు కల్పిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ కట్టుబడి ఉందని తెలిపారు.