S Janaki : ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి(S Janaki) అంత్యక్రియలు పూర్తయ్యాయి. కర్నాటక ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలను నిర్వహించింది. మైసూరుకు 25 కిలోమీటర్ల దూరంలోని కనియనహుండిలో ఉన్న ఫార్మ్‌హౌజ్‌లో ఆమె పార్థీవదేహాన్ని ఖననం చేశారు. కుమారుడు, మనవడు ప్రమాదంలో చనిపోయినందున మనవరాలు అప్సర విద్యుల(Apsara Vidyula) తలకొరివి పెట్టడంతో ఆంధ్ర బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను జరిపించారు.
గుండెపోటుతో కన్నుమూసిన సుప్రసిద్ధ గాయని శిష్ట్ల జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరులోని అపోలో బీజీఎస్ ఆస్పత్రిలో శనివారం రాత్రి 7:00 గంటలకు జానకి మరణించగా.. ఆదివారం అభిమానుల సందర్శనార్థం జానకి మృతదేహాన్ని మహారాజా కాలేజి మైదానంలో ఉంచారు.
#WATCH | Mysuru, Karnataka | Fans mourn and pay their last respects to the mortal remains of legendary playback singer S Janaki, affectionately referred to as Janaki amma and Nightingale of Deccan, who died at the age of 88 in Mysuru, last night. pic.twitter.com/JioV3IgcOs
— ANI (@ANI) July 12, 2026
సాయంత్రం జానకి పార్థీవ దేహాన్ని కనియనహుండిలో ఉన్న ఫార్మ్‌హౌజ్‌కు తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. జానకి వీరాభిమాని, సంరక్షకుడిగా ఉన్న నవీన్‌కు చెందిన ఫామ్‌హౌజ్ అది. కడసారి లెజెండరీ సింగర్‌ను చూసిన అత్యంత సన్నిహితులు, స్నేహితులు, వేలాదిగా అభిమానులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన జానకి.. మూడేళ్లకే సంగీతంపై ఆసక్తి పెంచుకుంది. పదేళ్లకే పాటందుకున్న జానకమ్మ.. 60 ఏళ్ల సినీసంగీత ప్రస్థానంలో ఎన్నో మధురమైన గేయాలు ఆలపించింది.
అధికారిక లాంఛనాలతో ఎస్.జానకి అంత్యక్రియలు పూర్తి
🔹 కర్ణాటక ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మైసూరులో ఎస్.జానకి అంత్యక్రియలు ముగిశాయి.
🔹 జానకి మనవరాలు అప్సర విద్యుల ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
🔹 మైసూరు మహారాజా కళాశాల మైదానంలో వేలాది మంది అభిమానులు, ప్రముఖులు కడసారి… pic.twitter.com/6wh3eQit6H
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) July 12, 2026
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంతో పాటు 20 భాషల్లో దాదాపు 48 వేలకు పైగా పాటలు పాడారు. నాలుగు జాతీయ అవార్డులు, 31 రాష్ట్ర అవార్డులు, మైసూర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమమాని అవార్డును స్వీకరించిన గానకోకిలకు బంధువులు, సన్నిహితులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.