Maharastra | సీఎం ఫడ్నవీస్ ఇలాకాలో బీజేపీకి షాక్.. నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
Maharastra | మహారాష్ట్ర (Maharastra) ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీజేపీ (BJP) నేతృత్వంలోని అధికార కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగగా మూడు స్థానాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) కూటమి విజయం సాధించింది. అధికార మహాయుతి (Mahayuti) కూటమికి కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కాయి.
Maharastra : మహారాష్ట్ర (Maharastra) ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీజేపీ (BJP) నేతృత్వంలోని అధికార కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగగా మూడు స్థానాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) కూటమి విజయం సాధించింది. అధికార మహాయుతి (Mahayuti) కూటమికి కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. ముఖ్యంగా ఆరెస్సెస్ (RSS) అడ్డా, సీఎం ఫడ్నవీస్ (CM Fadnavis) సొంత ఇలాకా అయిన నాగ్‌పూర్ (Nagpur) లో కూడా అధికార కూటమి ఓటమిపాలైంది. ఈ ఫలితం బీజేపీ పరువు తీసిందనే చెప్పవచ్చు.
సీఎం ఫడ్నవీస్ ఇలాకాలోనే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. ఫలితాలు పూర్తిగా వెలువడకముందే కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేతలపై కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉన్నారు. బుధవారం 12 స్థానాలకు ఫలితాలు వెలువడగా అందులో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలువలేదు. దాంతో ప్రధాని మోదీ సహా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎద్దేవా చేస్తూ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ కూడా.. ఈవీఎంలలో అక్రమాలు జరుగుతున్నాయని, బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ తరచూచేసే డిమాండ్ ప్రస్తావిస్తూ సెటైరికల్ పోస్ట్‌పెట్టారు.
బ్యాలట్ విధానంలో ఎన్నికలకు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బ్యాలెట్ విధానంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు ఫలితాలు వెలువడితే ఒక్క స్థానంలో కూడా గెలువలేదుగా అని ఎద్దేవా చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇప్పుడు ఎదురుదాడి చేసింది. మహారాష్ట్రలో ఏకంగా సీఎం ఇలాకాలోనే బీజేపీ ఓడిపోవడం సిగ్గుచేటని విమర్శించింది. బీజేపీ పతనానికి ఇది నాంది అని వ్యాఖ్యానించింది. 2029లో బీజేపీని ప్రజలు గద్దె దించుతారని మండిపడింది.
నాగ్‌పూర్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహ్లేను 3,271 ఓట్ల తేడాతో ఓడించారు. ఓట్ల లెక్కింపు 40 గంటలకుపైగా సాగిన తర్వాత గురువారం ఫలితం వెలువడింది. బీజేపీకి సంప్రదాయంగా బలమైన స్థానంగా ఉన్న నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ గెలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫడ్నవీస్‌తోపాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం చేసినా బీజేపీకి ఓటమి తప్పలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maharastra | సీఎం ఫడ్నవీస్ ఇలాకాలో బీజేపీకి షాక్.. నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

