ఠాక్రే శివసేనలో మరో తిరుగుబాటు!
మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పార్టీ చీలికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆపరేషన్ టైగర్-4 జరగనున్నట్టు షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే మురళీ పటేల్ వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పటేల్ తెలిపారు.
- షిండేతో 14 మంది ఎమ్మెల్యేల భేటీ
ముంబై, సెప్టెంబర్ 7 : మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పార్టీ చీలికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆపరేషన్ టైగర్-4 జరగనున్నట్టు షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే మురళీ పటేల్ వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పటేల్ తెలిపారు. శివసేన(యూబీటీ)కు చెందిన 9 మంది లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఇప్పటికే షిండే నాయకత్వంలోని శివసేనలో చేరిపోగా షిండే వర్గం బలం లోక్‌సభలో 7 నుంచి 13కు పెరిగింది.
అయితే 14 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఠాక్రే వర్గానికి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల మంది కలసికట్టుగా ఫిరాయించిన పక్షంలో చట్ట ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేరే రకమైన న్యాయ, రాజకీయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ 14 మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండేను ఒక రహస్య ప్రదేశంలో కలుసుకున్నట్టు కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఠాక్రే వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

