మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 21:46:40

‘మహా’ పోలీసులను వదలని కరోనా

‘మహా’ పోలీసులను వదలని కరోనా

ముంబై : మహారాష్ట్ర పోలీసులను కరోనా వణికిస్తోంది. నిత్యం వంద మందికిపైగా  కరోనా బారినపడుతుంటడంతో  అధికారులు హడలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 161 మంది పోలీసులు వైరస్‌ బారినపడగా ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు 21,988 మంది పోలీసులు కరోనా బారినపడగా 18,372 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

3,381 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 235 మంది మృతి చెందారని ఉన్నతాధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 12.5 లక్షల మందికిపైగా వైరస్‌ బారినపడగా 9.5 లక్షల మందికిపైగా చికిత్సకు కోలుకున్నారు. 2.73 లక్షల మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 33 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన రాష్ర్టాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo