ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో రమ్మీ (Rummy) ఆడుతూ కెమెరాకు చిక్కిన వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకాటేపై (Manikrao Kokate) వేటు పడింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడలు, యువజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత క్రీడామంత్రి దత్తాత్రేయ భర్నేకు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Maharashtra Minister Manikrao Kokate has been appointed as the new Sports Minister of Maharashtra, while he has been removed from the Agriculture Ministry. pic.twitter.com/1V341WOyiz
— ANI (@ANI) July 31, 2025
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత అయిన కోకాటే.. నాసిక్ జిల్లాలోని సిన్నార్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ క్యాబినెట్లో వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత నెల 20న అసెంబ్లీకి హాజరైన ఆయన.. సభలో తన మొబైల్ ఫోన్లో రమ్మీ ఆడుతూ కనిపించారు. ఈ వీడియోను శరద్ పవార్ ఎన్సీపీ నేత రోహిత్ పవార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘అధికారంలో ఉన్న జాతీయవాద వర్గం బీజేపీని సంప్రదించకుండా ఏమీ చేయలేనందున, లెక్కలేనన్ని వ్యవసాయ సమస్యలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రోజూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ, వ్యవసాయ మంత్రికి వేరే పని లేకపోవడంతో రమ్మీ ఆడటానికి సమయం దొరికినట్లు కనిపిస్తోంది’ అని ఎక్స్‌లో విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కోకాటేను మంత్రిపదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి.
“#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”
सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.
रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq
— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025
ఈ నేపథ్యంలో కోకాటె స్పందిస్తూ.. ‘తాను సభలో ఆటలు ఆడటం లేదు. నేను అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని యూట్యూబ్ లైవ్ చూస్తున్నా. వీడియో ఓపెన్ చేయాగానే ప్రకటనలు వస్తాయి కదా. అలాగే ప్రకటన వచ్చింది. నేను దానిని స్కిప్ చేసి వీడియో చూసే సయమంలో రికార్డ్ చేశారు. ఇది కేవలం 18 సెకన్ల వీడియో మాత్రమే. ఇందులో ప్రకటనను స్కిప్ చేస్తున్న దృశ్యం చూపించలేదు. కానీ వీడియోను వైరల్ చేశారు. నేను వ్యవసాయ మంత్రిని. నా బాధ్యత నాకు బాగా తెలుసు. నేను ఇప్పటివరకు రైతుల కోసం చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నా. కానీ రోహిత్ పవార్ దాని గురించి ఎప్పుడూ మాట్లాడడు. నా పనిని చూడడు. అతను ఖాళీ పరిశ్రమలను చూస్తున్నాడు’ అని మండిపడ్డారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కోకాటేను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి, మరో శాఖను అప్పగించడం గమనార్హం.