Manikrao Kokate | ముంబై: మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కోకటే రైతులను బిచ్చగాళ్లతో పోల్చారు. అమరావతిలో శుక్రవారం జరిగిన వ్యవసాయ ప్రదర్శన సందర్భంగా రూ.1కే పంటల బీమా గురించి ఓ విలేకరి ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ, ‘బిచ్చగాడు సైతం రూ.1ని భిక్షంగా తీసుకోడు, కానీ మేము రూ.1కే పంటల బీమా ఇస్తున్నాం. అయినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసేవారు ఉన్నారు.
ఇతర రాష్ర్టాలవారు దరఖాస్తు చేస్తుండటం వంటి అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని ఆపవలసి ఉంది ’అని అన్నారు. రైతులను మంత్రి అవమానించారని కిసాన్ సభఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్చేసింది.