ముంబై: మరాఠీలో మాట్లాడనందుకు మహారాష్ట్ర వ్యక్తి ఒక మహిళను వేధించాడు. మరాఠీ తెలియకుండా మహారాష్ట్రలో ఎలా ఉంటున్నావు? అని ప్రశ్నించాడు. (Man Harasses Woman For Not Speaking Marathi) దీనికి ఆ మహిళ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక మహిళను మరాఠీలో మాట్లాడాలని ఒక వ్యక్తి బలవంతం చేశాడు. అయితే తనకు మరాఠీ రాదని, అందుకే మాట్లాడలేనని ఆమె హిందీలో చెప్పింది. ఆ భాష నాకు తెలియకపోతే నేను మాట్లాడాలని మీరు ఎలా ఆశిస్తారు? అని ప్రశ్నించింది.
కాగా, ఆ వ్యక్తి మహిళతో మరింత దురుసుగా మాట్లాడాడు. మరాఠీ తెలియకుండా మహారాష్ట్రలో ఎలా ఉంటున్నావు? అని అడిగాడు. దీనికి ఆమె ధీటుగా బదులిచ్చింది. ‘నేను ఎక్కడ నివసించాలి అని అనుకుంటే అక్కడ ఉంటాను, నాకు ఇక్కడ సొంత ఇల్లు ఉంది’ అని చెప్పింది. అయితే ఆ మహిళది ఏ ఊరు అని ఆ వ్యక్తి అడిగాడు. మరాఠీలోనే మాట్లాడాలని పట్టుబట్టాడు. దీంతో ఆ మహిళ ఆగ్రహించింది. ‘నేను మాట్లాడను. నువ్వేం చేస్తావు? నాకు నచ్చిన భాషలో మాట్లాడతా. నా నోరు నా ఇష్టం’ అని గట్టిగా అరిచింది. అక్కడ గుమిగూడిన జనం వారిద్దరిని సముదాయించేందుకు ప్రయత్నించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ప్రతిస్పందించారు. భాషాపరంగా మహిళను వేధించడాన్ని కొందరు ఖండించారు. ఆ మహిళ ధైర్యాన్ని మరికొందరు ప్రశంసించారు. భాష ముఖ్యమే కాని ఇలా వేధించడం తగదని కొందరు హితవుపలికారు. ‘దేశాన్ని భాషాపరంగా మనం విభజిస్తున్నాం. అది సరైనది కాదు’ అని ఒకరు విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు ప్రతి భారతీయ వ్యక్తికి ఉన్నదని మరొకరు గుర్తు చేశారు.
Kalesh b/w a Marathi guy and lady over not speaking Marathi in Maharashtra
pic.twitter.com/QFi9n6K96z— Ghar Ke Kalesh (@gharkekalesh) May 12, 2025