ముంబై : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే.. ఇవాళ టెస్లా కారు(Tesla Car)ను డ్రైవ్ చేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఆయన స్వయంగా ఆ కారును నడిపారు. టెస్లా కంపెనీ ముంబై లో తన షోరూమ్‌ను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ముంబైలో టెస్లా కంపెనీ తన షోరూమ్‌ను ఓపెన్ చేయడం గొప్ప విషయమని ఏకనాథ్ షిండే తెలిపారు. మహారాష్ట్రలో అత్యధిక స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయన్నారు. మహారాష్ట్రలో అద్భుతమైన మౌళిక సదుపాయాలున్నాయన్నారు. మహారాష్ట్రలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని, ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా మహారాష్ట్ర మారినట్లు ఆయన చెప్పారు.
◻️LIVE📍मुंबई 🗓️ 16-07-2025
📹 टेस्लाच्या भारतातील पहिल्या एक्सपिरियन्स सेंटरला भेट – लाईव्ह https://t.co/FpUM3OG5ah
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) July 16, 2025