Ajit Pawar | అజిత్ పవార్‌కు డెంగ్యూ.. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు (Ajit Pawar ) డెంగ్యూ సోకింది. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ తెలిపారు.
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు (Ajit Pawar ) డెంగ్యూ సోకింది. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ తెలిపారు. 64 ఏళ్ల అజిత్ పవార్ బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావపోవడంతో మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. అజిత్ పవార్‌కు డెంగ్యూ సోకినట్లు శనివారం నిర్ధారణ అయ్యిందని తెలిపారు. అందువల్ల విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు చెప్పారు. ప్రజా సేవ బాధ్యతలకు అజిత్ పవర్ కట్టుబడి ఉన్నారని ప్రఫుల్ పటేల్ తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రజా విధులు కొనసాగించేందుకు పూర్తి శక్తితో తిరిగి వస్తారని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, ఎన్సీపీలో కీలక నేత అయిన అజిత్ పవార్ ఈ ఏడాది జూలై 2న తన వర్గం ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరారు. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 40 మందికిపైగా మద్దతు తనకు ఉందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలింది.
Contrary to speculative media reports suggesting that Shri Ajit Pawar is not attending public events, I would like to clarify that he has been diagnosed with dengue since yesterday and has been advised medical guidance and rest for the next few days. Shri Ajit Pawar remains…
— Praful Patel (@praful_patel) October 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

