Eknath Shinde | ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపిక నేడు (సోమవారం) జరుగుతుందని శివసేన చీఫ్, ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే చెప్పారు. ఆయన ఆదివారం సతారా జిల్లాలోని తన స్వగ్రామంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధిష్ఠానానికి తాను బేషరతుగా మద్దతిస్తున్నానని చెప్పారు.
తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిని సోమవారం నిర్ణయిస్తారని తెలిపారు. మహాయుతి 2.0 ప్రభుత్వం ఈ నెల 5న ప్రమాణ స్వీకారం చేస్తుందని బీజేపీ శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరు ఖరారయిందని బీజేపీ నేత ఒకరు తెలిపారు.