రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి… గోవా నుంచి ముంబై చేరుకున్న సీఎం షిండే
ముంబై: మహారాష్ట్ర సీఎం, శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే గోవా హోటల్లోని రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక విమానంలో ముంబై విమానాశ్రయానికి శనివారం రాత్రి చేరుకున్నారు. అనంతరం వారితో కలిసి బస్సులో ఒక హోటల్‌కు వెళ్లారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. ఆదివారం ఉదయం రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం షిండే నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష జరుగనున్న నేపథ్యంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాగా, గురువారం ప్రత్యేక విమానంలో ఒంటరిగా గోవా నుంచి ముంబైకి వచ్చిన ఏక్నాథ్ షిండే అనూహ్యంగా ఆ సాయంత్రం సీఎంగా, బీజేపీ నేత ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. షిండే నాటి నుంచి ముంబై టు గోవాకు షెటిల్ సర్వీస్ చేస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత గురువారం రాత్రి గోవా చేరుకున్నారు. అక్కడి రెబల్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం ముంబైకి తిరిగి వచ్చారు. అనంతరం రాత్రికి గోవా హోటల్‌కు వెళ్లారు.
మరోవైపు శనివారం మధ్యాహ్నం గోవాలోని హోటల్‌ను రెబల్ ఎమ్మెల్యేలు ఖాళీ చేశారు. సీఎం షిండే రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక బస్సులో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం ముంబైకి చేరుకున్నారు. బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడంతో ఆదివారం, సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు కూడా సీఎం షిండే రెబల్ ఎమ్మెల్యేల వెంటే ఉండనున్నారు.
#WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde along with his faction of Shiv Sena MLAs after they arrived at Mumbai Airport from Goa pic.twitter.com/b7MfybsVha
— ANI (@ANI) July 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

