రాయితీలతో రాజీపడం.. రాజ్యాధికారమే లక్ష్యం
రాయితీలతో రాజీపడమని.. రాజ్యాధికారమే ల క్ష్యంగా ముందుకుసాగుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. తమ వాటా దక్కేదాకా బీసీలను ఏకం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని ఆయన హెచ్చరించారు.
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 5 : రాయితీలతో రాజీపడమని.. రాజ్యాధికారమే ల క్ష్యంగా ముందుకుసాగుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. తమ వాటా దక్కేదాకా బీసీలను ఏకం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 7న బెంగళూర్‌లో జరుగనున్న జాతీ య ఓబీసీ మహాసభకు హైదరాబాద్‌లోని గ న్పార్క్ నుంచి బుధవారం సాయంత్రం బీసీ నేతలు ప్రత్యేక బస్సులో తరలివెళ్లగా, జాజుల శ్రీనివాస్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మండల కమిషన్ సి ఫార్సులను అమలుచేయాలని దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు ప ట్టించుకోకపోవడం అన్యాయమని మండిపడ్డారు.
కమీషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్టు పార్లమెంట్లో ప్రకటించిన ఆగస్టు 7న ఏటా దేశంలోని బీసీలకు ఏకం చేస్తూ జాతీ య ఓబీసీ మహాసభలను అన్ని రాష్ర్టాల్లో నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే బెం గళూర్లోని సిటీ యూనివర్సిటీలో 11వ మ హాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు ఆయ న పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం జరుగనున్న ఈ సభను చరిత్రాత్మక సభగా ఆయన అభివర్ణించారు. దేశంలోని 80కోట్ల ఓబీసీల ను ఏకం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ స భకు అన్ని రాష్ర్టాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు. బీసీ పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఈ సభలో పాల్గొంటారని తెలిపారు. బీసీ నేతలు గుజ్జ కృష్ణ, కుందారం గణేశాచారి, కుల్కచర్ల శ్రీనివాస్, బీ మణిమంజరి, పిట్ల శ్రీధర్, వీరస్వామి, గొడుగు మహేశ్‌యాదవ్, ఎం చంద్రశేఖర్ గౌడ్, దీటి మల్ల య్య, రమ, జాజుల లింగంగౌడ్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు తరలివెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

