ముంబై: దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు, మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా కాలుష్యం కోరలు చాస్తున్నది. గత కొన్ని రోజులుగా ముంబైలో గాలి నాణ్యత క్షీణిస్తూ వస్తున్నది. దాంతో ఉదయాన్నే నగరంపై దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉంటుంది. పొగమంచు కారణంగా రోడ్లపై విజిబిలిటీ తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముంబైలో ఎయిర్ క్వాలిటీ ప్రస్తుతం అధ్వాన్నంగా ఉన్నదని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ (SAFAR)-ఇండియా తెలిపింది. ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇంత అధ్వాన్నంగా ఉండటానికి ప్రధానంగా పరిశ్రమలే కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వాహనాల వినయోగం పెరగడం కూడా మరో కారణమంటున్నారు.