ముంబై: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. ఒక దశలో రోజుకు నాలుగు లక్షల యాభై వేలు దాటిన కేసుల సంఖ్య క్రమంగా తగ్గి 1.27 లక్షలకు చేరుకుంది. అయితే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ సిటీలో ఒకే నెలలో (మే 1 నుంచి 31 వరకు) 9,928 మంది మైనర్లు కరోనా బారిపడ్డారు. అహ్మద్‌నగర్ సిటీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సునీల్ పోకర్నా ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశంలో ఓవరాల్ పాజిటివిటీ రేటుతోపాటే మైనర్లలో పాజిటివిటీ రేటు కూడా పెరిగిందని డాక్టర్ సునీల్ పోకర్నా చెప్పారు. ఏప్రిల్‌లో కరోనా బారినపడ్డ మైనర్ల సంఖ్య 7,760 కాగా, మే నెలలో ఆ సంఖ్య 9,928కి పెరిగిందని తెలిపారు. అయితే, మైనర్లలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా ఏ ఒక్కరిలోనూ సీరియస్‌గా లేదని పేర్కొన్నారు.
Maharashtra | 9,928 minors in Ahmednagar tested Covid positive in May
— ANI (@ANI) June 1, 2021
"Children positivity rate increased due to rise in overall positivity rate. In April, 7,760 children were tested positive. No serious incidents were reported," said Civil surgeon Sunil Pokharna (31.5) pic.twitter.com/OqGMCHm6GA