వివాహానికి వెళ్తూ.. మృత్యుఒడిలోకి.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం
అమరావతి : వివాహ కార్యక్రమానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కారులో వెళ్తున్న సమయంలో మృత్యురూపంలో వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని నంద్గావ్పేట్-దేవల్‌గావ్ రింగ్ రోడ్డులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజన్ గావ్ సుర్జీ గ్రామానికి చెందిన కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వాల్గావ్ మీదుగా నంద్‌గావ్‌పేట వైపు వెళ్తున్నది. కారు పోటే కళాశాల వద్దకు రాగానే.. డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించాడు.
అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఆ తర్వాత ట్రకు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి.. రోడ్డు అవతలి వైపు ఎగిరిపడిందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అక్కడే కొందరు కూలీలు ప్రమాదాన్ని గమనించి వెంటనే కారులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించి అతను సైతం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

