న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ‘మహదేవ్’ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ను భారత్‌కు రప్పిస్తున్నట్టు ఈడీ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. మనీలాండరింగ్, మోసానికి పాల్పడ్డారన్న కేసులో ప్రధాన నిందితులైన చంద్రకర్, మరొక ప్రమోటర్ రవి ఉప్పల్‌పై ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ జారీ చేసింది. దీంతో వారిద్దర్నీ దుబాయ్‌లో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతరం చంద్రకర్‌ను అరెస్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లో చంద్రకర్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారని తెలిసింది. 2019కు ముందు పండ్ల దుకాణం నడిపిన చంద్రకర్ దుబాయ్ నుంచి బెట్టింగ్ యాప్‌ను నడిపారు.