చెన్నై: ఆదాయ వివరాలను దాచిపెట్టిన కేసులో మనీల్యాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేపట్టాలని తమిళనాడు సీఎం విజయ్(CM Vijay)పై నమోదు అయిన పిటీషన్‌ను మద్రాసు హై కోర్టు తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ ఈ కేసులో ఇవాళ విచారణ చేపట్టంది. అయితే పిటీషనర్ తన అభ్యర్థనను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టును కోరారు. ఈ అంశంలో ఆ పిటీషన్ విత్‌డ్రా చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. పిటీషనర్ ప్రకారం.. 2015లో విజయ్ నివాసంలో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. ఆ సమయంలో అతని ఇంట్లో సుమారు 15 కోట్ల నగదు చిక్కింది. పులి సినిమాకు రెమ్యునరేషన్లో భాగంగా ఆ మొత్తం అందిటన్లు తెలుస్తోంది.
కానీ అకౌంట్స్ లెక్కల్లో ఆ డబ్బు గురించి వెల్లడించలేదు. దీంతో ఐటీశాఖ విజయ్‌పై సుమారు 1.5 కోట్ల పెనాల్టీ విధించింది. ఆ జరిమానాకు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో విజయ్ పిల్ వేశారు. ఫిబ్రవరి 5వ తేదీన కోర్టు ఆ పిటీషన్‌ను డిస్మిస్ చేసింది. కొడంగయ్యూర్కు చెందిన ఎం రాజ్‌కుమార్ కొత్తగా మరో పిటీషన్ వేశారు. గతంలో సోదాలు నిర్వహించిన సమయంలో దొరికిన మెటీరియల్ ఆధారంగా ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. నేరానికి పాల్పడిన విజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. ఆదాయ వివరాలను దాచిన విజయ్‌పై చీటింగ్, క్రిమినల్ కేసు పెట్టాలని పిటీషన్ కోరారు. అయితే ఆ పిటీషన్‌ను వెనక్కి తీసుకునేందుకు పిటీషనర్ అంగీకరించడంతో కోర్టు ఓకే చెప్పింది.