చెన్నై: సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, క్లీన్ రికార్డు లేకున్నా మీ ఉద్యోగ నియామకాన్ని రద్దు చేయవచ్చునని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో పి.కార్తికేయన్ 2021లో సీబీఓ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
తీరా అతను ఉద్యోగంలోకి చేరదామనుకునే సమయానికి అతని సిబిల్ రికార్డు క్లీన్గా లేనందున అతని నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. దీనిపై అతడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తాను తీసుకున్న రుణం ఎలాంటి జాప్యం లేకుండా కట్టేశానని వాదించాడు. మొత్తం రికార్డంతా క్లీన్గా ఉండాలని, సిబిల్ వ్యతిరేక నివేదిక ఉండకూడదని కోర్ట్ పిటిషన్ను కొట్టివేసింది.