Anuradha | భోపాల్: ఏడు నెలల్లో 25 మందిని పెండ్లాడి విలువైన వస్తువులతో ఉడాయించిన నిత్య పెళ్లి కూతురు అనురాధ(23)ను మధ్యప్రదేశ్ పోలీసులు సోమవారం వల పన్ని పట్టుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం నిర్వహిస్తున్న ఈ పెండ్లి స్కామ్ రాకెట్లో ఆమెను ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్యంగా ఎంచుకొన్న మగవాళ్లను నిందితురాలు చట్టబద్ధ పద్ధతిలో పెండ్లి చేసుకొని కొన్ని రోజులకే వాళ్లకు సంబంధించిన డబ్బు, నగలు, విలువైన వస్తువులతో ఉడాయించేది.
పోలీసులకు ఫిర్యాదులు రావడంతో సవాయ్ మాధోపుర్ కానిస్టేబుల్ ఒకరు వరుడి అవతారమెత్తి తన వివరాలను ఆన్లైన్లో పోస్ట్ చేసి ఏజెంట్లను సంప్రదించాడు. వాళ్లు ఆయనకు అనురాధ ఫొటో పంపగానే తన సహచర పోలీసుల సాయంతో దాడి చేసి నిందితురాలిని భోపాల్లో అరెస్ట్ చేశారు.