ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో త్రాగు నీరు కాలుష్యం(Water Contamination) అయిన ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతిచెందగా, సుమారు 1500 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భాగీరథ్పురలో జరిగిన నీటి కాలుష్యం ఘటన గురించి ఎన్డీటీవీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మంత్రి కైలాశ్ విజయవర్గీయా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. నోరుజారిన ఆయన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి విజయవర్గీయా క్షమాపణలు చెప్పారు.
తన ఎక్స్ అకౌంట్లో స్పందిస్తూ.. తనతో పాటు తన బృందం ప్రభావిత ప్రాంతంలో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. మంత్రి విజయవర్గీయా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.భాగీరథ్పురకు నీళ్లు సరఫరా చేసే ప్రధాన పైప్లైన్ సమీపంలో ఉన్న టాయిలెట్ లీకేజీ అవడం వల్ల ఆ ప్రాంతానికి సరఫరా అయిన నీళ్లు కలుషితం అయినట్లు అధికారులు చెబుతున్నారు.
मैं और मेरी टीम पिछले दो दिनों से बिना सोए प्रभावित क्षेत्र में लगातार स्थिति सुधारने में जुटी हुई है। दूषित पानी से मेरे लोग पीड़ित हैं और कुछ हमें छोड़कर चले गए, इस गहरे दु:ख की अवस्था में मीडिया के एक प्रश्न पर मेरे शब्द गलत निकल गए। इसके लिए मैं खेद प्रकट करता हूँ।
लेकिन जब…
— Kailash Vijayvargiya (@KailashOnline) December 31, 2025
ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి బిల్లులు ఎందుకు చెల్లించలేదని, ప్రత్యామ్నాయ మంచినీటి సౌకర్యాన్ని ఎందుకు కల్పించలేదని జర్నలిస్టు ప్రశ్న వేశారు. అయితే అనవసర ప్రశ్నలు వేయకండి అన్న మంత్రి ఆ తర్వాత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.