దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ నిర్ణయం అమలులోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేసుల తీవ్రత పెరిగితే మాత్రం… ఇంత కంటే కఠిన నిర్ణయాలు కూడా తీసుకోడానికి వెనకాడమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అయితే మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకూ ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడం గమనించాల్సిన అంశం. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రం కూడా నైట్ కర్ఫ్యూ విధించలేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రమే మొట్ట మొదటి రాష్ట్రంగా రికార్డుల్లోకి ఎక్కింది.