Madhya Pradesh Police | మహిళ జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన మధ్యప్రదేశ్ పోలీసులు..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటుచేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను (Woman) జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు (Dragging).
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటుచేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను (Woman) జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు (Dragging). కట్నీ జిల్లా (Katni) కౌరియాకు (Kauriya) చెందిన చైనా బాయ్ కచి (Chaina Bai Kachi) అనే మధ్య వయస్కురాలైన మహిళ స్థలంలో అధికారులు విద్యుత్ టవర్‌ను (Electricity tower) ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఆమెకు నష్ట పరిహారం (Compensation) ఇవ్వకుండానే టవర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో తన బంధువులతో కలిసి పనులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు (Police).. ఆమెను జుట్టు పట్టి అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. దీనినంతటినీ అక్కడున్నవారు తమ ఫోన్లలో బంధించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పంధించారు.
టవర్ నిర్మాణ పనులు అడ్డుకోవడంతోనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని, చట్టప్రకారమే వ్యవహరించామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ కేడియా (Manoj Kedia) వెల్లడించారు. అది పాత వీడియో అని చెప్పారు. అయితే తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా నిర్మాణ పనులు చేపట్టారని బాధితురాలు వాపోయారు. కాంట్రాక్టర్లు, విద్యుత్ కంపెనీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

