Watch: అందరూ చూస్తుండగా కుర్తా విప్పిన బీజేపీ మంత్రి.. ఎందుకంటే?
బీజేపీ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్ తన నియోజకవర్గమైన ముంగాలిలో వికాస్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక గ్రామంలో మాట్లాడిన ఆయనపై ఎవరో దురద పౌడర్ చల్లారు.
భోపాల్: అందరూ చూస్తుండగా బీజేపీ మంత్రి ఉన్నట్టుండి ఆయన ధరించిన కుర్తా విప్పారు. ఆ తర్వాత నీటితో తన చేతులను కడుక్కున్నారు. ఎవరో ఆయనపై దురదాకు పౌడర్ చల్లారు. దీంతో దురదను భరించలేకపోయిన ఆయన ఏకంగా కుర్తా విప్పేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి వికాస్ యాత్రను ప్రారంభించారు. దీంతో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వికాస్ యాత్రలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా బీజేపీ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్ తన నియోజకవర్గమైన ముంగాలిలో మంగళవారం వికాస్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక గ్రామంలో మాట్లాడిన ఆయనపై ఎవరో దురద పౌడర్ చల్లారు. ఆ దురదను భరించలేకపోయిన మంత్రి తన కుర్తాను విప్పారు. వాటర్ బాటిల్లోని నీటితో దురుద పెడుతున్న చేతిని కడుక్కున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, రెండు రోజుల కిందట బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర వర్మకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆయన చేపట్టిన వికాస్ యాత్రను ఒక గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ అడ్డుకున్నారు. తమ గ్రామంలో రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయకపోవడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ కంటే దారుణంగా బీజేపీ పాలన ఉందని విమర్శించారు. రోడ్డు వేయకపోతే ఓట్లు వేయబోమంటూ బీజేపీ ఎమ్మెల్యేను ఆ గ్రామ పెద్ద హెచ్చరించారు.
Madhya Pradesh Minister Removes Kurta, Washes Himself At BJP Event. Reason Is… https://t.co/j4Soh1q9Es pic.twitter.com/25g2Q4Bsgg
— NDTV (@ndtv) February 10, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

