భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీలో నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం ప్రారంభమైన జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొనడానికి మాజీ సీఎం ఉమాభారతికి ఆహ్వానం అందలేదు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను పోస్టర్ గర్ల్‌గా ఉండాలనుకోవడం లేదు. ఇప్పటికీ ప్రధాని మోదీ కంటే నేనే చాలా యంగ్. మరో 15, 20 ఏండ్లు పని చేయగల సత్తా నాలో ఉన్నది.
బీజేపీ అధికారంలోకి రావడానికి 2020లో జ్యోతిరాదిత్య సింధియా సాయం చేసుండొచ్చు. కానీ 2003లో భారీ మెజారీటితో ప్రభుత్వం ఏర్పాటు కావడంలో నా కృషి మరువలేనిది. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు గుర్తుపెట్టుకోవాలి’ అని ధ్వజమెత్తారు. జన ఆశీర్వాద్ యాత్రలో తాను పాల్గొంటే ప్రజల దృష్టి అంతా తనపై ఉంటుందని, ఇది చూసి బీజేపీ పెద్దలు తట్టుకోలేరని, అందుకే తనకు ఆహ్వానం పంపకపోయిండొచ్చని ఉమాభారతి చెప్పారు.