మదురై: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఈ పదవికి పార్టీ నాయకులలో ఒక వర్గం అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ దవాలేకు మద్దతు ఇచ్చారు. అయితే ఆదివారం జరిగిన పార్టీ 24వ సభలో ఎంఏ బేబీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
కేరళలోని ప్రక్కులంలో 1954లో జన్మించిన బేబీ.. కేరళ స్టూడెంట్ ఫెడరేషన్లో చేరికతో తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన కొల్లాంలోని ఎస్ఎన్ కాలేజీలో బ్యాచ్లర్ డిగ్రీలో చేరినా దానిని పూర్తి చేయలేదు. 1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. కేరళలోని కుంద్రాలో 2006 నుంచి 2016 వరకు ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహించారు.