న్యూఢిల్లీ: ఈ నెల 11న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బర్త్‌డే సందర్భంగా ఆమెకు ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ లగ్జరీ నౌకను కానుకగా ఇవ్వనున్నాడట. అలాగే ఆమె అభిమానులకు 100 ఐఫోన్ల ను బహుమతులుగా పంపాడట. ఈ మేరకు అతడు జాక్వెలిన్‌కు లేఖ రాశాడు. ‘మై బేబీ గర్ల్, మై బొమ్మ వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే. లేడీ జాక్వెలిన్(నౌక పేరు)ను నీకు పంపుతున్నా. ఇదే నెలలో అది నీకు అందుతుంది. చట్టబద్ధంగా అన్ని పన్నులు చెల్లించాను. వచ్చే ఏడాది బర్త్‌డే వేడుక ఇద్దరం కలిసి చేసుకుందాం’ అని లేఖలో పేర్కొన్నాడు.