Sukesh Chandrasekhar: జైలు గదిలో లగ్జరీ వస్తువులు.. బోరున ఏడ్చేసిన సుకేశ్ చంద్రశేఖర్.. వీడియో
Sukesh Chandrasekhar:సుకేశ్ చంద్రశేఖర్ బోరున ఏడ్చేశాడు. జైలు గదిలో లగ్జరీ వస్తువులతో అతను దొరికిపోయాడు. మనీల్యాండరింగ్ కేసులో చిక్కిన అతను ప్రస్తుతం మండోలీ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్(Money Laundering) కేసులో సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే అతను ఉంటున్న జైలు గదిలో లగ్జరీ వస్తువుల్ని(Luxury Items) గుర్తించారు. ఢిల్లీలోని మండోలి జైలు(Mandoli Jail)లో ఉంటున్న సుకేశ్ గదిని అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీలో అనేక లగ్జరీ వస్తువులు బటయపడ్డాయి. ఈ ఘటనకు చెందిన జైలు గది సీసీటీవీ విజువల్స్ రిలీజ్ అయ్యాయి.
#WATCH | Luxury items found in conman Sukesh Chandrasekhar’s jail cell. CCTV visuals from Mandoli jail shared by sources show Sukesh after raids caught items in his jail cell.
(Source: Mandoli Jail Administration) pic.twitter.com/Fr77ZAsGbF
— ANI (@ANI) February 23, 2023
జైలు గదిలో 1.5 లక్షల విలువైన గుక్కి సాండల్ను గుర్తించారు. సుమారు 80 వేల ఖరీదైన రెండు జతల జీన్ పాంట్లను కూడా గుర్తించారు. జైలర్ దీపక్ శర్మతో పాటు ఇతర ఆఫీసర్లు కాన్మాన్ సుకేశ్ గదిలో విచారణకు వెళ్లారు. ఆ సమయంలో అతని గదిలో ఖరీదైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. జైలర్ గదిలోకి వచ్చిన సమయంలో సుకేశ్ బోరున ఏడ్చేశాడు. సెల్లో ఓ మూలన నిలుచుని కన్నీరుపెట్టుకున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి.
200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో సుకేశ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహ్లను కూడా పోలీసులు ప్రశ్నించారు.అయితే సుకేశ్ జైలు గది విజువల్స్ లీకైన అంశంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

