ముంబై : మోసానికి పాల్పడిన కేసులో లూధియానా కోర్టు నుంచి అరెస్టు వారెంట్ జారీ అయినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై సినీ నటుడు సోనూసూద్ శుక్రవారం స్పందించారు. ఈ వార్తను సంచలనాత్మకం చేశారని, చిలువలు పలువలు చేసి వార్తలు రాశారని మూడో పార్టీకి సంబంధించిన కేసులో సాక్షిగా హాజరు కావాలని తనను కోర్టు ఆదేశించిందని, ఆ కేసుతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తన లాయర్లు స్పందించారని, ఫిబ్రవరి 10న ఈ వ్యవహారంలో తమకు ఎటువంటి సంబ ంధం లేదని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన ఇస్తామని ఆయన తెలిపారు.