న్యూఢిల్లీ, మే 18: లోక్‌సభ ఎన్నికల సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.8,889 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రలోభ పెట్టే పలు రకాల బహుమతులను స్వాధీనం చేసుకొన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. వీటిల్లో మాదక ద్రవ్యాలది సింహభాగం అని, రూ.3,959 కోట్లతో 45 శాతం వరకు ఉన్నదని తెలిపింది. రూ.849.15 కోట్ల నగదు, రూ.814.85 కోట్ల విలువైన మద్యం, రూ.1,260.33 కోట్ల విలువైన లోహాలను సీజ్ చేశామని ఈసీ వెల్లడించింది. అలాగే ‘సీ-విజిల్’ యాప్‌కు 4,24,317 ఫిర్యాదులు రాగా, 4,23,908 పరిష్కరించామని తెలిపింది.